ధర్మపురి: కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందండంతో మనస్తాపానికి గరైన తండ్రి తాగుడుకు బానిసై.. మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ధర్మపురిలో చోటు చేసుకొంది. ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురికి చెందిన మామిడి రాజన్న కుమారుడు గణేశ్ కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటినుంచి రాజన్న తాగుడుకు బానిసయ్యాడు. శుక్రవారం ఇంటి నుంచి వెళ్లి పురుగుల మందు తాగి ఇంటికొచ్చాడు. కుటుంబ సభ్యులు వెంటనే ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందాడు. రాజన్న భార్య మంగ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మహిళతో బాబా అసభ్య ప్రవర్తన
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని హనుమాన్‌వాడకు చెందిన ఓ మహిళపై లైంగికదాడికి యత్నించిన ఫకీర్‌బాబాపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. మెట్‌పల్లి పట్టణానికి చెందిన మహ్మద్ చాంద్‌మియా బాబా వేషంలో ఓ మహిళ ఇంటికి వెళ్లి తావీదులు కడతానని చెప్పి నమ్మించి.. అసభ్య ంగా ప్రవర్తిస్తూ.. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని బాధితురాలు పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేసింది. బాబాపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment