‘బిర్లా’లో బహుళ సాంస్కృతిక సమ్మేళనం
కరీంనగర్‌రూరల్: బొమ్మకల్ బైపాస్‌లోని బిర్లా ఓపెన్‌మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో శనివారం బహుళ సంస్కృతి సమ్మేళనం నిర్వహించారు. తెలంగాణ, హరియాణా రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు, జానపద కళలకు సంబంధించిన నృత్యాలతో విద్యార్థులు సందడి చేశారు. పాఠశాల చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నేటితరం విద్యార్థులకు మన సంస్కృతితోపాటు ఇతర రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ బబితా విశ్వనాథన్‌తో కలిసి బహుమతి ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment