వివాహేతర సంబంధంతోనే హత్య
వేములవాడ: వివాహేతర సంబంధంతోనే రషీద్ హత్య జరిగిందని వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి తెలిపారు. హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేములవాడరూరల్ సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వేములవాడలో నివసించే మనోహర్ జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నాడు. ఈక్రమంలో పట్టణంలో నివసించే మహ్మద్ రషీద్(35)కు మనోహర్ భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య పంచాయితీలు జరిగాయి. అయినా వారిద్దరిలో మార్పు రాకపోగా.. మనోహర్ భార్య పట్టణంలోని మరో ఇంట్లో ఉంటుంది. దీన్ని భరించలేకపోయిన మనోహర్ 45 రోజుల క్రితమే దుబాయ్ నుంచి ఇండియాకొచ్చాడు. ఈనెల 18వ తేదీ తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటకొచ్చిన రషీద్‌ను కత్తితో పొడిచి చంపి, పరారయ్యాడు. మల్లారం రోడ్డు ప్రాంతంలో శనివారం మనోహర్‌ను అరెస్ట్ చేసి, అతని నుంచి పాసుపోర్టు, ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్, హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు మారుతి, రమేశ్ ఉన్నారు.
ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి
నిందితుడి రిమాండ్
Comments
Please login to add a commentAdd a comment