సిమ్స్‌కు పార్థివదేహం దానం
● నేత్రదానంతో ఇద్దరికి కంటి చూపు
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని యైటింక్లయిన్‌కాలనీకి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి దాసారపు మోహన్(59) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఆయన సభ్యులు మృతదేహాన్ని రామగుండం సింగరేణి మెడికల్ కాలేజీకి శనివారం దానం చేశారు. అంతకుముందు ఇద్దరు అంధులకు వెలుగులు ప్రసాదించడానికి, ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ ద్వారా మృతుని నేత్రాలు దానం చేశారు. సదాశయ ఫౌండేషన్, కమాన్‌పూర్ లయన్స్ క్లబ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో పార్థివదేహాన్ని స్వీకరించిన సిమ్స్ అనాటమీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కల్పన, టెక్నీషియన్లు లక్ష్మణ్ కుమార్, సిద్ధార్థ, తిరుపతితోపాటు సిబ్బంది, మృతుని కుటుంబ సభ్యులు, సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు గౌరవ వందనం చేసి నివాళి అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment