కరీంనగర్‌క్రైం: చిరువ్యాపారం చేసుకునే ఓ వ్యక్తి గ్లోబల్ మార్కెట్ ఇన్వెస్ట్ మాయలో పడ్డాడు. పోలీసుల చొరవతో మోసపోయానని గ్రహించి బయటపడిన ఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. సైబర్‌క్రైం పోలీసుల వివరాల ప్రకారం కరీంనగర్ టవర్‌సర్కిల్ ప్రాంతంలో చిరువ్యాపారం చేసుకునే అఖిల్‌కు ఈ నెల 17న వాట్సప్ లింక్ ద్వారా మెస్సేజ్ వచ్చింది. గ్లోబల్ మార్కెట్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే త్వరగా రెట్టింపు డబ్బులు వస్తాయని నమ్మించారు. ఆ లింక్‌ను ఇన్‌స్ట్రాగాం ద్వారా ఓపెన్ చేసిన అఖిల్ మొదట రూ.4వేలు ఇన్వెస్ట్ చేయగా రూ.6,600 తనఖాతాకు జమ అయ్యాయి. ఇలా మొత్తం రూ.5.90 లక్షలు సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాకు పంపించాడు. ఈ పెట్టుబడి తిరిగి రావాలంటే మరో రూ.5లక్షలు కావాలని సూచించారు. దీంతో తనవద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడాకు వెళ్లి మేనేజర్‌ను కలిశాడు. అఖిల్ తనకు రుణం కావాలని, అందుకుగానూ బంగారం తాకట్టు పెట్టుకోవాలని మేనేజర్‌ను కోరగా అనుమానం వచ్చి కరీంనగర్ సైబర్ పోలీసులకు సమాచారం అందించాడు. సైబర్ క్రైం పోలీసులు బ్యాంక్ వద్దకు చేరుకుని అఖిల్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. తను సైబర్ వలలో చిక్కుకున్నాడని అవగాహన కల్పించారు. బాధితుడి ఫిర్యాదుతో కరీంనగర్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల చొరవతో బయటపడ్డ బాధితుడు
Comments
Please login to add a commentAdd a comment