కరీంనగర్‌లో కలపొద్దు
కొత్తపల్లి: కరీంనగర్ నగరపాలక సంస్థలో శివారు గ్రామాల విలీన ప్రతిపాదనపై వ్యతిరేకతలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం మల్కాపూర్ వాసులు కార్పొరేషన్ వద్దు గ్రామాలే ముద్దు అంటూ కరీంనగర్– జగిత్యాల బైపాస్‌రోడ్డులో రాస్తారోకోలు చేపట్టారు. విలీన ప్రక్రియ నిలిపివేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
విలీనాన్ని విరమించుకోండి
కరీంనగర్: కార్పొరేషన్‌లో గ్రామాల విలీన ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతూ మేయర్ వై.సునీల్‌రావు పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన పత్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఎంఏయూడీ పీఎస్ కిషోర్‌కు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment