వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేయాలి
విద్యానగర్(కరీంనగర్): వినియోగదారులు తమ సమస్యలను, జరిగిన నష్టం గురించి నేరుగా ఫిర్యాదు చేయాలని జిల్లా లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కమిషనల్ విజయ సారఽఽథి సూచించారు. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో మంగళవారం వినియోగదారుల హక్కుల సంస్థ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయసారఽథి మాట్లాడుతూ.. లీగల్ మెట్రాలజీశాఖ వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తోందన్నారు. వినియోగదారులు వస్తువుల కొనుగోలు, సేవల విషయంలో సమస్యలు ఎదుర్కొంటే నేరుగా ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, సివిల్ సప్లై అసిస్టెంట్ కమిషనర్ బుచ్చిబాబు, జాతీయ వినియోగదారుల హక్కుల సంస్థ జిల్లా కమిటీ అధ్యక్షుడు చిగుర్ల రాజు, ప్రధాన కార్యదర్శి కొయ్యడ రాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు వరాల జ్యోతి, జిల్లా ఉపాధ్యక్షుడు మంథని కిరణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment