దివ్యాంగుల జాబ్‌మేళాకు స్పందన
సప్తగిరికాలనీ(కరీంనగర్): మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులశాఖ, యూత్ ఫర్ జాబ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన దివ్యాంగుల జాబ్‌మేళాకు అనూహ్య స్పందన లభించింది. 17 కంపెనీలకు చెందిన ప్రతినిధులు మేళాలో పాల్గొనగా 348మంది దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 165మంది గ్రాడ్యుయేట్ పూర్తి చేసినవారు ఉండగా.. 102 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఉదయం కలెక్టర్ పమేలా సత్పతి జాబ్‌మేళాను సందర్శించారు. ఎంపిక విధానాన్ని పరిశీలించారు. శిక్షణ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా సంక్షేమ అధికారి సబి త, యూత్ ఫర్ జాబ్స్ కోఆర్డినేటర్స్ మధుసూదన్ షాహిద్, జిల్లా పరిషత్ సీఈవో శ్రీనివాస్, ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు, వారధి మెంబర్ సెక్రటరీ ఆంజనేయులు పాల్గొన్నారు.
సర్వే వేగవంతం చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేను నగరంలో వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆదేశించారు. శుక్రవారం నగరంలోని ఆదర్శనగర్, సు భాష్‌నగర్, అంబేడ్కర్ నగర్‌లలో జరుగుతు న్న ఇందిరమ్మఇళ్ల సర్వేను పరిశీలించారు. హౌ సింగ్‌బోర్డుకాలనీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆధునీకరణ పనులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలకసంస్థ డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి, డీఈ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘ఉద్యమకారులపై పుస్తకం తీసుకొస్తాం’
కరీంనగర్: తెలంగాణ ఉద్యమకారులపై పుస్త కం తీసుకొస్తామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ముఖ్య సలహాదారు ఓరుగంటి ఆనంద్ అన్నారు. శుక్రవారం కరీంనగర్‌లోని ఫోరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర–ఆలోచన వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి ఎంతోమంది ఉద్యమకారులు రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు నాయకత్వం వహించారని తెలిపారు. కేసీఆర్, పొన్నం ప్రభాకర్‌లు ఢిల్లీ స్థాయిలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారన్నారు. రచయితలు, మేధావులు, ఉద్యమకారులు వచ్చి, సలహాలివ్వడం శుభ పరిణామమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల నేపథ్యాన్ని తెలిపే పుస్తకాన్ని రూపొందించబోతున్నామని తెలిపారు. ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడిగెల రవీందర్ రెడ్డి, జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి, మానకొండూరు నియోజకవర్గ అధ్యక్షుడు ఎడ్ల జోగిరెడ్డి, రాష్ట్ర మహిళా నాయకురాలు ఐల ప్రసన్న, రచయితలు రాజేశం, రాజేశ్వరి, సమ్మయ్య, రామయ్య, వైరాగ్యం ప్రభాకర్, గాజోజు నాగభూషణం, మంద భాస్కర్ పాల్గొన్నారు.
క్వింటాల్ పత్తి రూ.7,000
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7,000 పలికింది. శుక్రవారం మార్కెట్‌కు 17 వాహనాల్లో 120 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.6,900, కనిష్ట ధర రూ.6,000కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. శని, ఆదివారాలు సాధారణ, సోమవారం అమావాస్య సందర్భంగా మార్కెట్‌లో క్రయ విక్రయాలకు సెలవు ఉంటుందని, మంగళవారం యథావిధిగా కొనుగోళ్లు జరుగుతాయని కార్యదర్శులు మల్లేశం, రాజా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment