కలెక్టర్‌కు యూనిసెఫ్ ప్రశంస
కరీంనగర్ అర్బన్: కలెక్టర్ పమేలా సత్పతిని యూనిసెఫ్ ప్రశంసించింది. యూనిసెఫ్ రాష్ట్ర వాష్ స్పెషలిస్ట్ వెంకటేశ్ శుక్రవారం ఆమె చాంబర్‌కు వచ్చి, ప్రశంసాపత్రం అందజేశారు. జిల్లాలో పారిశుధ్య కార్మికుల రక్షణ, వివిధ రకాల వంద శాతం బీమా సౌకర్యం, ఎక్కడా లేని విధంగా ఆరోగ్య పరీక్ష కార్డుల పంపిణీ, రక్షణ కవచాలు అందజేత, కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సలు, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తదితర కార్యక్రమాలు అమలయ్యేలా చూస్తున్నందుకు అభినందించారు. యూనిసెఫ్ రాష్ట్ర కన్సల్టెంట్ ఫణీంద్రకుమార్, జిల్లా సమన్వయకర్త కిషన్ స్వామి, జిల్లా సమన్వయకర్తలు రమేశ్, వేణుప్రసాద్, క్లస్టర్ ఫెసిలిటేటర్లు కల్యాణి, రవీందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment