అనుమానమే పెనుభూతమై..
గోదావరిఖని: మాట్లాడే పనుందని పిలిచి భార్య మేనమామపై తల్వార్‌తో దాడిచేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన కోల్‌బెల్ట్ ప్రాంతంలో మంగళవారం సంచనలం సృష్టించింది. స్థానిక వినోభానగర్‌కు చెందిన నంది శ్రీనివాస్‌ను మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రానికి చెందిన గొల్ల శ్రావణ్ కాలేజీ గ్రౌండ్‌లో వందలాది మంది విద్యార్థులు చూస్తుండగానే తల్వార్‌తో విచక్షణ రహితంగా దాడచేశాడు. తీవ్రగాయాలపాలైన నంది శ్రీనివాస్ చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గోదావరిఖని ఏసీపీ రమేశ్ కథనం ప్రకారం.. భీమారం ప్రాంతానికి చెందిన గొల్ల శ్రావణ్ వినోభానగర్‌కు చెందిన నంది శ్రీనివాస్ మేనకోడలు కాళ్ల పూజను ఆరేళ్లక్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రావణ్‌కు ఇతర మహిళతో వివాహేతర సంబంధం ఉందనే కారణంతో భార్యాభర్తల మధ్య ఏడాదిగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో పూజ మేనమామ జోక్యం చేసుకుని ఎందుకు కొడుతున్నావని భీమారం వెళ్లి అతడి తల్లిదండ్రులతో మాట్లాడి పద్ధతి మార్చుకోవాలని చెప్పి వచ్చాడు. తన ప్రవర్తన మార్చుకోకుండా గొల్ల శ్రావణ్ తనభార్య పూజను మళ్లీ కొట్టడంతో నంది శ్రీనివాస్, నంది నగేశ్, కాళ్ల కిరణ్ భీమారం వెళ్లి పూజను ఇంటికి తీసుకువచ్చారు. దీంతో పగపెంచుకుని శ్రావణ్ మంగళవారం గోదావరిఖనికి బైక్‌పై చేరుకున్నాడు. ఎలక్ట్రికల్ షాపులో పనిచేస్తున్న నంది శ్రీనివాస్‌ను బైక్‌పై ఎక్కించుకుని స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌కు తీసుకువచ్చాడు. అప్పటికే వెంట తెచ్చుకున్న తల్వార్‌తో నంది శ్రీనివాస్‌పై విచక్షణ రహితంగా దాడిచేశాడు. రామగుండం సీపీ శ్రీనివాస్, డీసీపీ చేతన ఆదేశాల మేరకు వెంటనే రంగంలో దిగిన వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి నిందితుడు గొల్ల శ్రవణ్‌ను పట్టుకుని అరెస్ట్ చేశారు. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి భార్యపై తప్పుడు ఆరోపణలు చేసి, అనుమానిస్తూ ఈఅఘాయిత్యానికి దిగినట్లు ఏసీపీ వెల్లడించారు. కాగా బాధితుడిని చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. సమావేశంలో సీఐలు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భార్య మేనమామపై హత్యాయత్నం
చూస్తుండగానే తల్వార్‌తో దాడి
ప్రాణాపాయ స్థితిలో
బాధితుడు శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment