ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఈడీగా అజయ్
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కార్పొరేట్ సెంటర్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కమర్షియల్)గా విధులు నిర్వహిస్తున్న అజయ్ దువాను నియమించారు. ఈమేరకు కార్పొరేట్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(హెచ్‌ఆర్) సీ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆర్‌ఈడీగా విధులు నిర్వహిస్తున్న కేదార్ రంజన్ పాండు పదవీ విరమణ చేయడంతో ఆయనస్థానంలో ఆర్‌ఈడీగా అజయ్‌దువాను నియమించారు.
నాసిరకం ఎరువులు విక్రయిస్తే చర్యలు
కమాన్‌పూర్(మంథని): నాసిరకం ఎరువులు, పురుగు ముందులు, విత్తనాలు విక్రయిస్తే కఠి న చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసా యాధికారి ఆదిరెడ్డి హెచ్చరించారు. స్థానిక డీసీఎంఎస్‌తోపాటు ఎరువుల షాపులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రైతులు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు తీసుకుంటూ పంటలకు ఎరువులను వాడాలని సూచించారు. డీఏవో వెంట ఏవో గిరి రామకృష్ణ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment