జమ్మికుంట: అలయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సంయుక్తంగా నిరుద్యోగ యువతకు నిర్వహించే ఉచిత నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అలయ ఫౌండేషన్ స్టేట్ కో– ఆర్డినేటర్ గాదె గుణసాగర్ సూచించారు. డ్రైవాల్, పాల్స్ సీలింగ్ టెక్నిషియన్, వెల్డింగ్, ప్రొబికేషన్ టెక్నీషియన్, ఆటో మొబైల్స్, టూ వీలర్, ఫీల్డ్ టెక్నిషియన్, ఎయిర్‌కండిషన్ అసిస్టెంట్, ఎలక్ట్రిషియన్, ఎక్సకవేటర్ ఆపరేటర్, ఆఫీస్ పరేషన్ ఎగ్జిక్యూటివ్ వంటి కోర్సుల్లో శిక్షణ పొందవచ్చాన్నారు. వయస్సు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలన్నారు. రెండు నెలల శిక్షణ, నెల ఆన్‌టైం జాబ్, పరిశ్రమ భాగస్వామ్యంతో శిక్షణ, కోర్సు సర్టిఫికెట్ అందిస్తామని అన్నారు. విద్యార్హతలు 8వ తరగతి నుంచి డిగ్రీవరకు చదువుకున్నవారు అర్హులని తెలిపారు. శిక్షణకాలంలో ఉచితవసతి, భోజనం ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ కోసం 5 జనవరి 2025వరకు వాట్సప్ నంబర్లు 9949446802, 9885981959, 9177413107ను సంప్రదించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment