హాస్టల్‌కు వెళ్లమన్నందుకు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): హాస్టల్‌కు వెళ్లాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థి దొమ్మటి ప్రసన్నకుమార్(18) సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో పండుగపూట ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండలోని ఓ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ప్రసన్నకుమార్ పండుగల సెలవుల కోసం ఇటీవల ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి తాను ఇక హాస్టల్‌కు వెళ్లనని మారాం చేస్తున్నాడు. అయితే, చదువుకుంటే బాగుపడతావని తల్లిదండ్రులు దొమ్మటి లత – రాజేందర్ ఎప్పటిలాగే సోమవారం కూడా మందలించారు. వారు సోమవారం ఉదయం పొలం పనులకు వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేరు. ఈ సమయంలో తన ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం పనులు ముగించుకుని తల్లి దండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి తమ కుమారుడు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. బోరున విలపించిన తల్లిదండ్రు.. ఈ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment