కల్యాణం.. కమనీయం
కరీంనగర్ కల్చరల్: నగరంలోని పలు ఆలయాల్లో సోమవారం గోదారంగనాథ కల్యాణాలను వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కల్యాణాలను తిలకించారు. యజ్ఞవరాహక్షేత్రంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం కనులపండువగా జరిగింది. సర్వ వైదిక సంస్థానం ట్రస్ట్ ఉపకులపతి వరప్రసాద్, అర్చకులు భక్తులు పాల్గొన్నారు. మార్కెట్ రోడ్ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన కల్యాణంలో ఈవో సుధాకర్, ధర్మకర్తలు చకిలం గంగాధర్, చకిలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతినగర్, మంకమ్మతోటలలోని వేంకటేశ్వర స్వామి దేవాలయాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈవో నాగారపు శ్రీనివాస్, ఆలయ అర్చకుల తదితరులు పాల్గొన్నారు.
యజ్ఞవరాహ క్షేత్రంలో స్వామివారి కల్యాణానికి హాజరైన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment