ప్రజలకు సకల శుభాలు కలగాలి
● ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్: తెలుగు ప్రజలకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. సకల శుభాలు కలగాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంటింటా కొత్త కాంతులు వెల్లివిరియాలని ఆక్షాంక్షించారు. పండుగలను కుటుంబసభ్యులతో కలిసి, సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
‘అందరి మనసు గెలిచిన వ్యక్తి.. రావుల పవన్’
కరీంనగర్: అందరి మనసు గెలిచిన వ్యక్తి రావుల పవన్ అని, ఎన్నీల ముచ్చట్లు ఓ గొప్ప యువ గళాన్ని కోల్పోయిందని తెరవే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్ల వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు గాజోజు నాగభూషణం అన్నారు. కవులు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం ఉండదని, అదే పవన్‌ను కోల్పోవడానికి కారణమని పేర్కొన్నారు. 141వ ఎన్నీల ముచ్చట్లు కార్యక్రమం సెయింట్ జార్జ్ స్కూల్ కరస్పాండెంట్ ఫాతిమా రెడ్డి ఆతిథ్యంలో సోమవారం రాత్రి తీగలగుట్టపల్లిలో నిర్వహించారు. రావుల శ్రీనివాసాచారి తన సోదరుడు పవన్ జ్ఞాపకాలను గుర్తు చేశారు. చామనపల్లి మిత్ర బృందం స్మృతి గీతాలు పాడింది. అంతకుముందు పవన్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి దామరకుంట శంకరయ్య, విలాసాగరం రవీందర్, కవులు అంజయ్య, మధుశ్రీ, రాము, చైతన్య, ప్రవీణ్‌కుమార్, రామయ్య, ఖాలీద్, అఖిల్‌కుమార్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment