క్రిష్ణగిరి: ఇంట్లో ఎవరూ లేని సమయంలో కళాశాల విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న ఘటన సింగారపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు... క్రిష్ణగిరి జిల్లా సింగారపేట సమీపంలోని నాయకనూరు గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు వెంకటేష్ కూతురు దమయంతి (19). క్రిష్ణగిరిలోని ప్రైవేట్ కళాశాలలో నర్సింగ్ చదువుతోంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం దమయంతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. విషయం తెలుసుకొన్న సింగారపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని స్వాధీనం చేసుకుని ఊత్తంగేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బంధువుల ఆందోళన:
దమయంతిని అదే ప్రాంతానికి చెందిన శ్రీధర్ (25) అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధించేవాడని విచారణలో తేలింది. దీంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. నిందితుడిని అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment