లారీని ఢీకొన్న బస్సు
యశవంతపుర: రాష్ట్రంలో పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు పక్కలో నిలిపిన లారీని వెనుక నుంచి బస్సు ఢీకొంది. ఈ ఘటన ఉడుపి జిల్లా కార్కళ తాలూకా సాణూరు వద్ద జరిగింది. గురువారం ఉదయం పొగమంచు వల్ల దారి కనిపించక ఆర్టీసీ బస్సు.. రోడ్డు పక్కలో నిలిపి ఉన్న లారీని ఢీకొంది. బస్సు చిక్కోడి నుంచి ధర్మస్థలం వెళ్తోంది. బస్సులోని 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని కార్కళ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
లారీ, ట్యాంకర్ ఢీ, డ్రైవర్ మృతి
లారీ, ట్యాంకర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఒకరు చనిపోయిన ఘటన కలబురగి తాలూకాలో గురువారం తెల్లవారుజామున జరిగింది. గొబ్బూరు క్రాస్ వద్ద లారీ, ట్యాంకర్ ఢీకొన్నాయి. ట్యాంకర్ డ్రైవర్ అనిల్(22) మరణించాడు. లారీ డ్రైవర్‌కు గాయలు కావటంతో కలబురగి జిల్లా ఆస్పత్రికి తరలించారు. రెండు వాహనాలు అతుక్కుపోవడంతో జేసీబీ ద్వారా విడదీశారు.
కారును ఢీకొన్న మిక్సర్ లారీ
ఆరుమందికి గాయాలు
ట్రాఫిక్‌లో నిలిచి ఉన్న కారును వెనుక నుంచి డాంబర్ మిక్సర్ ట్రక్ ఢీకొన్న ఘటనలో ఆరు మంది గాయపడిన ఘటన ఉత్తరకన్నడ జిల్లా యల్లాపుర అరైబెల్ ఘట్ట వద్ద గురువారం జరిగింది. హైవే– 63లో ట్రాఫిక్ జామ్ కారణంగా కారు నిలిచిపోయింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన మిక్సర్ ట్రక్ కారును ఢీకొనడంతో కారు దెబ్బతింది. అందులోని ఆరుమంది గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిక్సర్‌ని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాదంతో యల్లాపుర–అంకోలా రోడ్డు మార్గంలో గంటల కొద్ది ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
13 మందికి గాయాలు
ఉడుపి జిల్లాలో ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment