పల్లెసీమలో ఘర్షణ సెగలు
శివమొగ్గ: పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్ గురించి ఘర్షణ చెలరేగి ఒకరి హత్యకు దారి తీసిన ఘటన జిల్లాలోని భద్రావతి గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎమ్మెదొడ్డి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. దొడ్డేరి గ్రామ నివాసి శాంతకుమార్ (35) హతుడు కాగా ఘటనలో నిందితులు లేపాక్షి (40), అతీశ్, అభిలాష్‌తో పాటు నలుగురు గాయపడ్డారు.
ఏం జరిగిందంటే
హతుడు శాంతకుమార్, నిందితుడు లేపాక్షి కుటుంబాలు, పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. శాంతకుమార్ పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. దాని నుంచి లేపాక్షి కుటుంబం విద్యుత్ కనెక్షన్ తీసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్‌కు రిపేరీ విషయంలో సాయంత్రం పొలంలోనే గొడవ జరిగింది. పరస్పరం కొట్టుకున్నారు. తరువాతఎమ్మెదొడ్డి గ్రామంలోని మొరార్జీ దేశాయి పాఠశాల వద్ద కొట్లాట జరిగింది. లేపాక్షి వర్గం వారు మచ్చుకత్తితో శాంతకుమార్‌పై దాడి చేయడంతో తీవ్ర గాయాలతో మరణించాడు. పలువురు గాయపడి ఆస్పత్రిలో ఉన్నారు. గ్రామీణ పోలీసు స్టేషన్‌లో 10 మందిపై కేసులు నమోదయ్యాయి. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ జీకే మిథున్ కుమార్, ఏఎస్పీ అనిల్ కుమార్ భూమరెడ్డి, డీఎస్పీ నాగరాజ్ పరిశీలించారు. గొడవలు చెలరేగకుండా బందోబస్తు ఏర్పాటైంది.
ఒకరి నరికివేత
పలువురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment