నామినేషన్ దాఖలు చేస్తున్న అభ్యర్థి శ్రీధర్ రెడ్డి
బొమ్మనహళ్లి: రాష్ట్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని, బెంగళూరు నగరంలోని బీటీఎం లేఔట్‌లోను బీజేపీ జెండా ఎగురుతుందని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం నగరంలోని బీటీఎం లేఔట్ బీజేపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండటం వల్ల అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చామని అన్నారు. అంతకు ముందు పార్టీ అభ్యర్థి శ్రీధర్‌రెడ్డితో కలిసి కోరమంగళలోని గణపతి ఆలయానికి వెళ్లి పూజలు చేసి ఆడుగోడిలోని ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment