రూ.500 కోట్లకుపైగా పంట నష్టం | - | Sakshi
Sakshi News home page

రూ.500 కోట్లకుపైగా పంట నష్టం

Published Sun, Nov 12 2023 1:16 AM | Last Updated on Sun, Nov 12 2023 1:16 AM

పంట పొలాలను పరిశీలిస్తున్న మంత్రి నాగేంద్ర  - Sakshi

సాక్షి,బళ్లారి: ఈసారి ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాధారిత, మెట్ట ప్రాంతాల్లో సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోయిన నేపథ్యంలో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాగేంద్ర పేర్కొన్నారు. ఆయన శనివారం జిల్లాలోని హలకుంది, మించేరి, సంజీవరాయనకోట, సండూరు తాలూకాల్లో వివిధ గ్రామాల్లో రైతులు పంట పొలాలను పరిశీలించి రైతులకు ఽధైర్యం చెప్పారు. అన్ని గ్రామాల్లో రైతులు వ్యథలు ఒకటే..పంటలు ఎండిపోయిన దృశ్యాలను చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ... జిల్లాలో రెండు రోజులుగా వివిధ గ్రామాల్లో పంటలను పరిశీలించానని, రైతులకు ఒక రూపాయి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో రూ.500 కోట్లకు పైగా పంట నష్టం జరిగిందని, పూర్తిగా అంచనా వేయాల్సి ఉందన్నారు. బీజేపీ నాయకులు కరువులోను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం నుంచి గొడవ పడి అయినా సరే నిధులు తీసుకుని వస్తామన్నారు. బీజేపీ నాయకులు లోక్‌సభ ఎన్నికలపై ఉన్న శ్రద్ద రైతులను ఆదుకోవడంపై లేదన్నారు. తమ పార్టీకి చెందిన 136 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరు కూడా పార్టీని వీడరని, ఐదేళ్లు తమ ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగుతుందన్నారు. బీజేపీ పగటి కలలు కంటోందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అల్లం వీరభద్రప్ప, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అల్లం ప్రశాంత్‌, వ్యవసాయాధికారి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతలను ఆదుకుంటాం

మంత్రి నాగేంద్ర

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement