శివమొగ్గ: బెళగావి గ్రామీణ ప్రాంతంలో మహిళపై దాడి చేసి వివస్త్రగా ఊరేగించిన సంఘటనను ఖండిస్తు శివమొగ్గ నగరంలో ఉన్న శివప్ప నాయక సర్కిల్‌లో శనివారం మహిళా మోర్చా నాయకులు ధర్నా చేశారు. కాంగ్రెస్ సర్కారు పాలనలో మహిళలకు భద్రత కరువైందని ఆరోపించారు. దాడి కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి ఈశ్వరప్ప, శివమొగ్గ సిటీ ఎమ్మెల్యే ఎస్‌ఎన్. చన్నబసప్ప, మహిళా నాయకులు పాల్గొన్నారు.
సీఐ తోడుదొంగ అరెస్టు
దొడ్డబళ్లాపురం: అధికార దుర్వినియోగం, అవినీతి, అక్రమాల ఆరోపణలతో సస్పెండ్ అయిన బిడది సీఐ శంకర్ నాయక్ కేసులో సీసీబీ పోలీసులకు పలు ఆధారాలు లభించాయి. శంకర్ నాయక్ అక్రమాల్లో భాగస్వామిగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి లోకనాథ్‌ను అరెస్టు చేసి అతని మొబైల్‌ఫోన్‌ను పరిశీలించగా ఆధారాలు లభించాయి. శంకర్ నాయక్ చేసే అన్ని అక్రమాల్లో లోకనాథ్ అండగా ఉండేవాడు. ముఖ్యంగా రైస్ పుల్లింగ్ స్కాముల్లో ఇద్దరూ కలిసి అనేకమందిని మోసం చేసారు. ఇంకా శంకర్ నాయక్ పనిచేసిన కుదూరు, తావరెకెరె పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి డీల్‌లు కుదర్చడంతో పాటు సీఐకి ఇన్ఫార్మర్‌గా వ్యవహరించాడు.
అర్ధరాత్రి క్రిస్మస్‌పై
ఆంక్షలు వద్దు
● దక్షిణ కన్నడ జిల్లాలో సడలించాలి
● సర్కారుకు క్రైస్తవ పెద్దల వినతి
శివాజీనగర: కరావళిలో అర్ధరాత్రి క్రిస్మస్ పండుగ ఆచరణకు అవకాశం కల్పించాలని క్రైస్తవ సంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయి. సీనియర్ పాత్రికేయుడు ఆల్విన్ మెండోన్సా సహా పలువురు క్రైస్తవ ప్రముఖులు ఈ మేరకు సీఎం సిద్దరామయ్య, దక్షిణ కన్నడ జిల్లాధికారికి విన్నపాలను సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన భరోసాను నెరవేర్చాలని కోరారు.
ఏమిటీ క్రిస్మస్ విషయం?
క్రిస్మస్ అనేది ప్రపంచ స్థాయిలో ఆచరించే పండుగ. ప్రపంచానికి శాంతిని బోధించిన ప్రభు ఏసుక్రీస్తు జన్మదినాన్ని భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. రాష్ట్రమంతటా డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి వరకు చర్చీల్లో ప్రార్థనా కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఏసుక్రీస్తు జన్మదినమైన డిసెంబర్ 25 ఆరంభక్షణాలు, 24వ తేదీ అర్ధరాత్రి వరకు, ఆపై ప్రార్థనలు చేయడం శతాబ్దాల నుంచి ఉన్న సంప్రదాయం. దక్షిణ కన్నడలో కూడా ఇదే మాదిరిగా పండుగను జరుపుతారు. కానీ ఇటీవల సంవత్సరాల్లో భద్రతా కారణాల నెపంతో అర్ధరాత్రి వరకూ ప్రార్థనలకు జిల్లా యంత్రాంగం అనుమతి ఇవ్వడం లేదని ఆరోపణలు వచ్చాయి. అన్ని మతాలకు అవకాశం కల్పించినట్లుగానే క్రిస్మస్ పర్వదినానికి కూడా అర్ధరాత్రి వరకూ ఆచరణకు అనుమతించాలని కోరారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment