![మృతదేహం వద్ద తల్లీ బిడ్డ శోభ, హేమ - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/14/13bng102_mr_0.jpg.webp?itok=XtW_f0iI)
మృతదేహం వద్ద తల్లీ బిడ్డ శోభ, హేమ
తుమకూరు: కూతురి ప్రేమకు అడ్డుగా నిలిచాడని భర్తను భార్య సుపారీ ఇచ్చి హత్య చేయించింది. జిల్లాలోని కుణిగల్ తాలూకాలోని కుళ్ళినంజయ్యన పాళ్యలో గురువారం పార్ట్‌టైం ఉపాధ్యాయుడు కే.జీ. మరియప్పను కొందరు దుండగులు వెంటాడి హత్య చేయడం తెలిసిందే. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసి మరియప్ప భార్య శోభ, కుమార్తె హేమలతను విచారించారు. దీంతో గుట్టు వీడింది. హేమలత అదే గ్రామానికి చెందిన శాంతకుమార్‌ను ప్రేమిస్తోంది. ఇది గిట్టని మరియప్ప కూతురిని కొట్టాడు.
ప్రియునికి సుపారీ ఇచ్చి
దీంతో తల్లీకూతుళ్లు మరియప్ప మీద కక్షగట్టి శాంతకుమార్‌కు సుపారీ ఇచ్చారు. అతడు బెంగళూరులో ఉండే సంతు, హేమంత్ అనేవారిని పిలిపించి కాపుకాసి మొదట పెప్పర్ స్ప్రే కొట్టి, ఆపై హత్య చేయించాడు. మరియప్పకు ఫోన్ చేస్తు అతని కదలికల గురించి తల్లీ బిడ్డ హంతకులకు సమాచారమిచ్చారు. హత్య జరిగిన రోజు బెంగళూరులో శాంతకుమార్, హేమంత్ ఇళ్లలో పోలీసులు సోదాలు చేసి హత్యకు ఉపయోగించి వస్తువులను స్వాధీనం చేస్తున్నారు. మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇంటి పెద్దనే తుదముట్టించారు
Comments
Please login to add a commentAdd a comment