మినీ లారీ నిండా అక్రమ మద్యం | Sakshi
Sakshi News home page

మినీ లారీ నిండా అక్రమ మద్యం

Published Thu, May 9 2024 7:25 AM

మినీ లారీ నిండా అక్రమ మద్యం

కృష్ణరాజపుర: దొంగచాటుగా తరలిస్తున్న అక్రమ మద్యాన్ని ఎకై ్సజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 29 లక్షల విలువైన మద్యం పట్టుబడింది. దానిని తరలిస్తున్న రూ. 6 లక్షల విలువ చేసే మినీ లారీని కూడా సీజ్‌ చేశారు. మంగళవారం రాత్రి కోణనకుంటె వద్ద రాఘవేంద్ర నగరలో అబ్కారీ , ఎన్నికల అధికారులు సోదాలు జరిపారు. ఈ సమయంలో ఏపీకి చెందిన మినీ లారీని తనిఖీ చేయగా భారీమొత్తంలో మద్యం పెట్టెలు కనిపించాయి. మొత్తం 760 బాక్సులుగా తేలాయి. వాహనం డ్రైవర్‌ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement