నవంబరులో రాయర సహస్ర అష్టోత్తర స్తోత్ర పారాయణం
హొసపేటె: నగరంలోని పాత రాఘవేంద్ర స్వామి మఠంలో మంత్రాలయ మఠ పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆదేశాలనుసారం నవంబర్ 17న సామూహిక సహస్ర అష్టోత్తర రాయ స్తోత్ర పారాయణం జరగనుంది. స్థానిక పాతరాయల మఠంలో ఆదివారం జరిగిన సన్నాహాక సమావేశంలో రాయర మఠాధిపతి పవనాచార్యులు మాట్లాడుతూ కలియుగ కామధేనువు కల్పవృక్షం రాఘవేంద్ర స్వామి వారి అష్టోత్తర పారాయణ ధర్మ చైతన్యం, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశంగా సమష్టిగా నిర్వహించారన్నారు. ఆరోజున జరిగే కార్యక్రమంలో హొసపేటె, కమలాపుర, మరియమ్మనహళ్లి ప్రాంతాలతో పాటు బ్రాహ్మణ సంఘాలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నగరంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి అష్టోత్తరలో పాల్గొనేలా ఆహ్వానించాలని నిర్ణయించారు. అనంతరం కార్యక్రమంలో పండితుల ఉపన్యాసం, ధాత్రిహవనం జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బ్రాహ్మణ సంఘం సభ్యులందరూ సహకరించాలని కోరారు. మఠానికి చెందిన భీమసేనాచార్యులు, కేఎన్. గురురాజారావు, విజయేంద్ర దేశాయి, ప్రహ్లాద్ ఆచార్య, గురురాజ ఆచార్య, రాయర మఠం డివిజనల్ మేనేజర్ గురురాజ్ దిగ్గావి, గురురాజ్ దేశ్‌పాండే, మాధవరావు, మానకరి శ్రీనివాస, విజయకుమార్, గరగ రాఘవేంద్రరావు, గరగ హనుమంతరావు, రాయసం శ్రీనివాసులు, గురురాజ శిర్కోళ, మాతా వెంకటేష్ సత్యనారాయణ జోషి, మంత్రాలయ దాస సాహిత్య ప్రాజెక్టు జిల్లా కోఆర్టినేటర్ అనంత పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment