సాగునీటి పథకాలపై నిర్లక్ష్యం సరికాదు
● కావేరికున్న ప్రాధాన్యత తుంగభద్రకు లేదా?
● ఎన్‌ఆర్‌బీసీలో రూ.1648 కోట్లు
దుర్వినియోగం
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాం పరిధిలో రాయచూరు, కొప్పళ జిల్లాల్లో సాగు నీటిి పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ పాటిల్ పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందక రైతులు అందోళన చేస్తున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. కొప్పళ జిల్లా రైతులు నీటిని కింది భాగానికి వదలకుండ అడ్డుకుంటున్నారన్నారు. వారం రోజుల్లో సమస్యలను పరిష్కరించక పోతే భవిష్యుత్తులో మంత్రులను జిల్లాలో పర్యటించకుండా నిర్బంధిస్తామన్నారు. రాయచూరు జిల్లాలోని శాసన సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు సమావేశమై రైతులకు నీరందేలా చూడాలన్నారు. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు మౌనం వహించడం తగదన్నారు. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందడం లేదన్నారు. గేజ్ నిర్వహణలో లోపాలను సవరించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య కావేరి నదికి ఇస్తున్న ప్రాధాన్యత తుంగభద్ర డ్యాం కాలువలకు ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదన్నారు. నారాయణ పుర కుడి కాలువ మరమ్మత్తు పనులలో రూ.1648 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment