నదిలో ఇద్దరు గల్లంతు
సాక్షి బళ్లారి: గదగ్ జిల్లాలో భారీ వర్షం కురవడంతో నదులు, వంకలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షం కురవడంతో గదగ్ జిల్లా నరగుంద తాలూకా హుణసికట్టి గ్రామ సమీపంలో నదిలో శివప్ప అశోక్(25), మణికంఠ అశోక్(26) అనే యువకులు కొట్టుకొనిపోయారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతుండటంతో ప్రవాహాన్ని దాటే సమయంలో ఇద్దరు యువకులు నదిలో కొట్టుకొనిపోగా శివప్ప అశోక్ మృత దేహం లభ్యమైంది. మణింకఠ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై నరగుంద పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గుండెపోటు నివారణకు
జాగ్రత్తలు అవసరం
రాయచూరు రూరల్: సమాజంలో వైద్యులు గుండెపోటు వ్యాధి నివారణకు జాగ్రత్తలు అవసరమనే విషయాన్ని బాధితులకు తెలపాలని గుండె వ్యాధి వైద్యాధికారి అజిత్ కులకర్ణి పేర్కొన్నారు. నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. గుండెపోటు సోకిన రోగులకు తమదైన శైలిలో వైద్య సేవలు అందించాలన్నారు. గుండెపోటు నేడు సింహ స్వప్నంగా మారిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment