ఆయుధ పూజకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఆయుధ పూజకు సర్వం సిద్ధం

Published Fri, Oct 11 2024 2:20 AM | Last Updated on Fri, Oct 11 2024 2:20 AM

ఆయుధ

సాక్షి బళ్లారి: దసరా పండుగ నేపథ్యంలో నగరంలో పలు వ్యాపార కేంద్రాలకు సంబంధించిన రహదారులు కిటకిటలాడాయి. శుక్రవారం ఆయుధ పూజ, శనివారం దసరా పండుగ సందర్భంగా ఒక్క రోజు ముందుగా పండ్లు, పూలు, గుమ్మడికాయలు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి కనబరిచారు. ఆయుధ పూజ సందర్భంగా వాహనాలు, తమకు జీవనాధారమైన వ్యాపార కేంద్రాలు, ఇతర వాటికి పూలు అలంకరించుకొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకొన్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా వారం రోజుల నుంచి భక్తిశ్రద్ధలతో జమ్మి చెట్టుకు పూజలు చేసిన మహిళలు దసరాను మరింత భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నగరంలోని బెంగళూరు రోడ్డు, సంగం సర్కిల్‌, మోతీ సర్కిల్‌, దుర్గమ్మగుడి, ఎంజీ సర్కిల్‌ తదితర రోడ్లలో పెద్ద ఎత్తున పూలు అమ్మకాలు జరిగాయి. గుమ్మడికాయలు కూడా మంచి గిరాకీ పలికాయి.

దంత వైద్య కళాశాలలో ఆయుధ పూజ

బళ్లారి రూరల్‌ : దసరా పండుగ సందర్భంగా గురువారం బీఎంసీఆర్‌సీ ఆవరణలోని ప్రభుత్వ దంత వైద్యకళాశాలలో ఆయుధ పూజ నిర్వహించారు. శుక్రవారం ఆయుధపూజ ఉండగా కళాశాలకు సెలవు ఉన్నందున గురువారమే జరుపుకొన్నారు. అమ్మవారి చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా బీఎంసీఆర్‌సీ డీన్‌ డాక్టర్‌ గంగాధరగౌడ, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మంజునాథ్‌, దంత వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ భారతి, అధ్యాపకులు, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పూజా సామగ్రికి భలే గిరాకీ

వ్యాపార కేంద్రాలు కిటకిట

No comments yet. Be the first to comment!
Add a comment
ఆయుధ పూజకు సర్వం సిద్ధం1
1/1

ఆయుధ పూజకు సర్వం సిద్ధం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement