రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలి
బళ్లారిఅర్బన్: భారత దేశ పారిశ్రామిక రంగంలో, సమాజ సేవలోను ఎంతో ఉన్నతమైన సేవలు అందించిన మహాన్ దేశ భక్తుడు రతన్‌టాటాకు భారతరత్న అవార్డు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీడీసీసీఐ అధ్యక్షుడు యశ్వంత్‌రాజ్ నాగిరెడ్డి కోరారు. ఆ మేరకు సదరు కార్యాలయంలో దివికేగిన రతన్ టాటాకు ఘనంగా నివాళులు అర్పించారు. రతన్ టాటా అంటేనే సేవకు, ప్రతిభకు స్పూర్తిదాయకం అన్నారు. రతన్ టాటా మహామానవతావాది, దేశానికి లభించిన కోహినూరు వజ్రం లాంటి వారని కొనియాడారు. ఆయనతో ఉన్న పరిచయాలను ప్రముఖులు జితేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ కార్యదర్శి కేసీ సురేష్‌బాబు, ఎస్పీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా రతన్‌టాటా మృతికి ఘనంగా నివాళి అర్పించారు.
బోనులో పడ్డ చిరుత
● ఊపిరి పీల్చుకున్న ప్రజలు
హుబ్లీ: జిల్లాలోకి కలఘటిగి తాలూకా తబకదహొన్నళ్లి ఫిర్కా చుట్టు పక్కల గ్రామాల్లో చాలా రోజుల నుంచి కనిపిస్తూ స్థానికుల్లో భయాందోళన పుట్టించిన చిరుతను ఎట్టకేలకు అధికారులు బంధించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత రెండు నెలల నుంచి మలకనకొప్ప, ఉణసికట్టి, ద్యావనకొండ, ముక్కళ్ల, తబకదహొన్నళ్లి, బిదరగడ్డి తదితర చుట్టు పక్కల గ్రామాల్లో చిరుత బెడదపై ప్రజలు భయపడ్డారు. ఆ గ్రామాల మధ్యలో చిరుత ఆవు, కుక్కలపై అప్పుడప్పుడు దాడి చేసింది. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు అటవీ శాఖ ప్రణాళిక ప్రకారం నాలుగైదు చోట్ల బోనులు పెట్టి ఎన్నో రోజులుగా కార్యాచరణ చేపట్టడంతో ఉణసికట్టి గ్రామ సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. సుమారు 5, 6 ఏళ్ల వయస్సు ఉన్న మగ చిరుత అని తెలుసుకున్న స్థానికులు దాన్ని చూడటానికి ఎగబడ్డారు. ఈ కార్యాచరణలో డివిజనల్ అటవీ అధికారి అరుణ అత్తగి, డీఆర్‌ఎఫ్‌ఓలు బేవినకట్టి, మంజునాథ్ ఉణకల్ పాల్గొన్నారు.
దుకాణం లైసెన్సు రద్దుకు వినతి
రాయచూరు రూరల్: వడవాటి గ్రామానికి ఆహార పదార్థాలను సరఫరా చేసే రేషన్ దుకాణాల లైసెన్సు రద్దు చేయాలని దళిత సంఘర్ష సమితి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద జిల్లాధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడారు. తాలూకాలోని బాయిదొడ్డి పరిధిలోకి వచ్చే వడవాటి చౌక ధర దుకాణం లైసెన్సును ఆసరా సంస్థకు చెందిన ఒకే కుటుంబంలో నలుగురికి అధికారులు ఎలా అనుమతి ఇచ్చారో విచారణ జరిపి రద్దు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం అందించారు.
గెద్దలమర్రి తండాలో
20 మంది ఆస్పత్రి పాలు
●మాంసాహారం తిని పలువురికి అస్వస్థత
రాయచూరు రూరల్: దేవుడి కార్యంలో భుజించిన మాంసాహారం వికటించడంతో 20 మంది అస్వస్థతకు గురైన ఘటన జిల్లాలోని లింగసూగూరు తాలూకా గెద్దలమర్రి తండాలో చోటు చేసుకుంది. బుధవారం తండాలో దేవుని కోసం వండిన మాంసాన్ని గ్రామస్తులు తిన్నారు. సాయంత్రం గ్రామస్తులకు వాంతులు, విరోచనాలు ప్రారంభం కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందగానే వైద్యులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని చికిత్స అందించారు. తాలూకా ఆరోగ్య అధికారి డాక్టర్ అమరేష్ ముకాపుర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి క్షేమ సమాచారాలు విచారించారు.
కరవే జిల్లా అధ్యక్షుడిగా హులుగప్ప
బళ్లారిఅర్బన్: కర్ణాటక రక్షణ వేదిక ప్రవీణ్ శెట్టి బణ నూతన జిల్లా అధ్యక్షుడిగా వీహెచ్.హులుగప్పను రాష్ట్రాధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి నేతృత్వంలో ఎంపిక చేసినట్లు రాష్ట్ర సంచాలకుడు అద్దిగేరి రామన్న గురువారం తెలిపారు. కరవే జిల్లా ప్రధాన కార్యదర్శిగా 16 ఏళ్లుగా ఆయన అందించిన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షుడుగా ప్రవీణ్ శెట్టి అవకాశం అందించినట్లు తెలిపారు. అనంతరం హులుగప్ప మాట్లాడుతూ రక్షణ వేదికలో తమ సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన సందర్భంగా సంఘం జిల్లా పదాధికారులకు, సభ్యులకు స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ వేదిక నిబంధనలను అనుసరిస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని, వేదిక అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కరవే పదాధికారులు వెంకటరెడ్డి, ఓబుల్‌రెడ్డి, ఉమేష్‌గౌడ, ఆనంద్, విజయ్‌కుమార్, నాగరాజ్, వెంకటేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment