మైసూరు: త్వరలో ఎలాంటి మంత్రివర్గ విస్తరణ లేదని, బండీపురలో రాత్రి పూట వాహనాల సంచారంపై ఉన్న నిషేధాన్ని తొలగించబోమని, ఎకై ్సజ్ శాఖలో రూ.700 కోట్ల ముడుపులను వసూలు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య సవాల్ విసిరారు. ఆయన బుధవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. బండీపుర జాతీయ ఉద్యానవనం పరిధిలో రాత్రివేళ వాహన సంచారానికి అనుమతించే ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వం ముందు లేదన్నారు. కేబినెట్‌లోకి మళ్లీ తీసుకోవాలని ఎమ్మెల్యే నాగేంద్ర అడగగా, ఉప ఎన్నికల తర్వాత చూద్దామని చెప్పాను తప్ప ప్రత్యేకించి మంత్రివర్గ విస్తరణ ఉండబోదని అన్నారు. ఎకై ్సజ్ శాఖలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచే వైదొలుగుతానని అన్నారు. ఎకై ్సజ్ శాఖలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదన్నారు. ఆ ఆరోపణలను రుజువు చేయకుంటే ప్రధాని మోదీ పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.
పీపీఈ కిట్లలో అవినీతి
గత బీజేపీ సర్కారు కరోనా సమయంలో రూ.330 కి లభించే పీపీఈ కిట్‌ను రూ.2140 లకు కొనుగోలు చేశారని, దీనికి మోదీ ఏం సమాధానం చెబుతారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీవి తప్పుడు ఆరోపణలు
సీఎం సిద్దరామయ్య ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment