కొప్పళ ఎస్సీ ఎస్టీ కేసులో మలుపు
సాక్షి బళ్లారి: కొప్పళ జిల్లాలో దళితులపై దాడి చేసిన ఘటనలో 98 మందికి కొప్పళ జిల్లా న్యాయమూర్తి జీవిత ఖైదును విధిస్తూ తీర్పు ఇవ్వడం తెలిసిందే. ఈ కేసు మళ్లీ మలుపు తిరిగింది. నిందితులు ఈ తీర్పుపై ధార్వాడలోని హైకోర్టు బెంచ్‌ని ఆశ్రయించగా బుధవారం 97 మందికి బెయిల్ లభించింది. కింది కోర్టు తీర్పును నిలుపుదల చేసింది.
మరకుంబిలో ఏం జరిగింది
వివరాలు.. 2014 ఆగస్టు 28న కొప్పళ జిల్లా గంగావతి తాలూకా మరకుంబి గ్రామానికి చెందిన మంజునాథ, అతని స్నేహితులు గంగావతి పట్టణంలో పవర్ సినిమా చూడడానికి శివ థియేటర్‌కు వచ్చారు. టికెట్లు తీసుకుంటున్న సమయంలో దళితులకు – ఇతర వర్గాలకు గొడవ జరిగింది. చిన్న ఘర్షణ పెద్దగా మారడంతో మరకుంబిలో గుడిసెలకు నిప్పు పెట్టే స్థాయికి చేరింది. ఇష్టానుసారంగా దాడులు నిర్వహించారు. ఇరు వర్గాల ఘర్షణల ఫలితంగా గ్రామంలో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ఈ అల్లర్ల కేసులో అప్పట్లో దాదాపు 101 మందిపై కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణ జరుగుతూ వచ్చింది. గత నెలలో 98 మందిని కొప్పళ జిల్లా కోర్టు దోషులుగా నిర్ధారించి అందరికీ జీవిత ఖైదును విధించింది. దీంతో నిందితులు ఈ తీర్పును ధార్వాడ హైకోర్టు ధర్మాసనంలో సవాల్‌చేశారు. హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపి.. 97 మందికి జీవిత ఖైదు శిక్ష పై స్టే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి బెయిల్ జారీ చేశారు. వారు రూ.50 వేల బాండ్, ఒకరి పూచీకత్తు ఇవ్వాలని ఆదేశించారు.
97 మందికి ధార్వాడ హైకోర్టు
బెంచ్‌లో బెయిలు
జిల్లా కోర్టు జీవితఖైదుపై స్టే జారీ
Comments
Please login to add a commentAdd a comment