సర్కారు చేతికి నిజలింగప్ప ఇల్లు!
శివాజీనగర: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎస్.నిజలింగప్ప చిత్రదుర్గలో నివాసమున్న ఇంటిని ప్రభుత్వం రూ.4.18 కోట్లతో కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఆ ఇంటిని ప్రభుత్వం కొనుగోలు చేసి సంరక్షిస్తామని గతంలో అనేకమంది సీఎంలు ప్రకటించారు. ఇందుకు రూ.5 కోట్లు నిధులు కేటాయించారు. ఇప్పుడు చిత్రదుర్గ జిల్లాధికారికి నిధులను మంజూరు చేసింది.
ప్రథమ ముఖ్యమంత్రి
కర్ణాటకలో ప్రథమ ముఖ్యమంత్రిగా నిజలింగప్ప పేరుపొందారు. 1956– 58, మళ్లీ 1962 నుంచి 68 వరకు సీఎంగా సేవలందించారు. కన్నడనాడు ఏకీకరణకు ఎంతగానో పాటుపడ్డారు. 2000 లో ఆయన కన్నుమూశారు. చిత్రదుర్గం నడిబొడ్డును కలెక్టరాఫీసు పక్కన ఆయన విశాలమైన నివాసం వినయ నివాస్ ఉంది. ఆ ఇంటిని అమ్మేయాలని, రూ.10 కోట్ల విలువ చేస్తుందని ఆయన పిల్లలు తెలిపారు. దీంతో ప్రభుత్వమే కొనుగోలు చేసి స్మారక మ్యూజియంగా తీర్చిదిద్దాలని డిమాండ్లు వచ్చాయి. దీంతో సర్కారు ఎట్టకేలకు కదిలింది.
కొనుగోలుకు రూ. 5 కోట్లు మంజూరు
Comments
Please login to add a commentAdd a comment