వీడిన చోరీ మిస్టరీ
సాక్షి,బళ్లారి: తన ఇంట్లో తానే దొంగతనం చేసి తన ఇంట్లో దొంగతనం జరిగిందని నాటకం ఆడిన ఓ కిలాడి యువతితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా హగరబన్నిహట్టి గ్రామానికి చెందిన తస్మయి అనే మహిళ సెప్టెంబర్ 30వ తేదీన తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో దాదాపు రూ.11 లక్షలు విలువ చేసే బంగారం దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసుల తనిఖీలో ఇంటి దొంగలే బంగారం దోచుకెళ్లారని బయటపడింది. పోలీసులకు అనుమానం రావడంతో సమగ్ర విచారణ చేయగా ఇంట్లో ఉన్న బంగారం, వెండిని ముజీబుల్లా అనే వ్యక్తి సహకారంతో దోచుకెళ్లారు. విచారణ చేసిన అనంతరం బంగారంతో పాటు రూ.1.30 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
రైతులకు భూపరిహారం ఏదీ?
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంత రైతుల భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని జేడీఎస్ గ్రామీణ అధ్యక్షుడు నిజాముద్దీన్ డిమాండ్ చేశారు. బుధవారం బెంగళూరులోని జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ కార్యాలయంలో అధికారులతో చర్చించారు. జాతీయ రహదారి 167 హగరి–జడ్చర్ల మధ్య రహదారి నిర్మాణానికి భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించాలని సూచించారు. తాలూకాలో భూములు కోల్పోయిన 85 మంది రైతులకు భూస్వాధీన పరిహారం అందించాలన్నారు. నెల రోజుల్లో పరిహారం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు.
● పట్టుబడిన ఇంటి దొంగలు
● పోలీసులకు కట్టుకథ అల్లిన వైనం
Comments
Please login to add a commentAdd a comment