చినుకు చాటున ప్రకృతి సౌందర్యం | - | Sakshi
Sakshi News home page

చినుకు చాటున ప్రకృతి సౌందర్యం

Published Mon, Oct 28 2024 12:51 AM | Last Updated on Mon, Oct 28 2024 12:51 AM

చినుక

చినుకు చాటున ప్రకృతి సౌందర్యం

బొమ్మనహళ్లి: గత కొన్నిరోజులుగా బెంగళూరు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షాలతో నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండుగా మారాయి. కొండప్రాంతాలలో జలపాతాలు సందడి చేస్తున్నాయి. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్‌ తాలూకాలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ముత్యాల మడుగు జలపాతం సౌందర్యం మిన్నంటుతోంది. ముత్యాల మడుగు జలపాతం సుమారు 250 అడుగుల ఎత్తున కొండల పై నుంచి తెల్లని నురగతో జాలువారుతోంది. దీనిని చూడడానికి వందలాది మంది పర్యాటకులు వస్తున్నారు. కొందరు డ్రోన్‌లు ఎగరేసి చిత్రీకరణ చేస్తున్నారు. అలాగే 300 మెట్ల కొండను ఎక్కి అక్కడి నుంచి దూకే జలపాతాన్ని వీక్షించడం మరో మధురానుభూతి. ఈ జలపాతాన్ని చూడాలంటే సుమారు రెండు కిలోమీటర్ల దూరం అడవిలో నడిచి వెళ్లాలి. అయినా కూడా పర్యాటకలు తగ్గడం లేదు. ఎక్కువ గా యువత తరలివస్తోంది.

నిఖిల్‌ అభిమన్యుడా: సీఎం

సాక్షి, బెంగళూరు: నిఖిల్‌ రెండుసార్లు ఓడిపోయాడని, అలాంటి వాడు అభిమన్యుడు ఎలా అవుతాడని సీఎం సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. ప్యాలెస్‌ మైదానంలో ఆదివారం మీడియాతో సీఎం మాట్లాడుతూ నిఖిల్‌ అభిమన్యుని వంటివాడని, ఇప్పుడు అర్జునునిలా వస్తాడని హెచ్‌డీ కుమారస్వామి చెప్పడంపై స్పందించారు. గతంలో మండ్య, రామనగరల్లో రెండు సార్లు ఓడిపోయినప్పుడు అభిమన్యుడు కాలేకపోయాడని, ఇప్పుడు అర్జునుడు అవుతాడా అంటూ ఎగతాళి చేశాడు. ఉప ఎన్నికల గురించి సమావేశంలో చర్చించామని, దీపావళి పండుగ ఉండడంతో కొందరు నేతలు గైర్హాజరయ్యారని తెలిపారు.

మంత్రిపై శోభా ఫైర్‌

శివాజీనగర: కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె, బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి భైరతి సురేశ్‌ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకొంది. ఆదివారం మీడియాతో మాట్లాడిన శోభా కరంద్లాజె తాను అవినీతికి పాల్పడినట్లు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని సవాల్‌ చేశారు. మంత్రి బైరతి ముడాకు సంబంధించి వేలాది ఫైల్స్‌ని కాల్చివేశారు. దాని గురించి మాట్లాడితే నాపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాను ఏనాడు అవినీతికి పాల్పడలేదన్నారు.

భారీ వర్షాలకు ముత్యాల మడుగు జలపాతం హొయలు

బెంగళూరు సమీపంలో టూరిస్టు స్పాట్‌

మహిళకు రూ.10.42 లక్షలు వంచన

టెలిగ్రామ్‌ గ్రూప్‌లో బంగారు, వెండి, ప్లాటినం కాయిన్లను బిడ్‌ చేస్తే లాభం లభిస్తుందని ఆశ చూపించి మహిళకు రూ.10.42 లక్షలు టోపీ వేశారు. వివేక్‌నగరవాసి ఎన్‌.సుకన్య. ఆమెకు టెలిగ్రామ్‌ యాప్‌లో లింక్‌ పంపించిన వంచకులు ఆన్‌లైన్‌లో బంగారం, వెండి, ప్లాటినం విక్రయం, కొనుగోలు చేస్తే తక్కువ అవధిలో అధిక లాభం వస్తుందని ఆశపెట్టారు. ఆసక్తి కనబరిచిన మహిళ తన వద్ద ఉన్న నగదు, స్నేహితుల వద్ద కొంత అప్పుచేసి ఆన్‌లైన్‌లో గోల్డ్‌కాయిన్‌లు కొనుగోలుచేసి విక్రయించారు. కొన్న ప్రతిసారీ డబ్బు కట్‌ అవుతోంది తప్ప బంగారు ఏదీ కేటాయించలేదు. టెలిగ్రామ్‌ గ్రూప్‌ సైతం బ్లాక్‌ అయింది. దీంతో ఆమె సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
చినుకు చాటున ప్రకృతి సౌందర్యం1
1/2

చినుకు చాటున ప్రకృతి సౌందర్యం

చినుకు చాటున ప్రకృతి సౌందర్యం2
2/2

చినుకు చాటున ప్రకృతి సౌందర్యం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement