గిరాకీ జోరు | - | Sakshi
Sakshi News home page

గిరాకీ జోరు

Published Mon, Oct 28 2024 12:51 AM | Last Updated on Mon, Oct 28 2024 12:51 AM

గిరాక

గిరాకీ జోరు

చల్లని బీరు..

బనశంకరి: బెంగళూరు చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడ మందుబాబులు విస్కీ బ్రాందీ వంటి హాట్‌ హాట్‌ మద్యం తాగుతారు, బీర్లు కొనరేమో అని చాలా మంది అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. ఎన్నిసార్లు ధరలు పెంచినా, రాజధానిలో బీరు విక్రయాలు రికార్డు సృష్టించాయి. ఎకై ్సజ్‌ శాఖకు తద్వారా సర్కారుకు భారీ ఆదాయం చేరుతోంది. ఏటేలా బీరు విక్రయాలు 49 శాతం పెరుగుతున్నాయి. 2021–22లో కరోనా సమయంలో అమ్మకాలు 32 శాతం పడిపోయింది. ఆ ఏడాది 6.05 కోట్ల లీటర్లు బీరు విక్రయమైంది. 2021–22లో కరోనా ప్రభావం తగ్గడంతో, పబ్‌, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు తెరవడంతో 6.79 కోట్ల లీటర్లకు పెరిగింది.

ఏమిటీ కారణాలు

2022–23లో 10.17 కోట్ల లీటర్ల బీర్లను తాగేశారు. ఈసారి వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, లోక్‌సభ ఎన్నికలు, వరుసగా సెలవులతో పాటు అనేక కారణాలతో బీర్లకు గిరాకీ ఏర్పడింది. మద్యం కంటే బీర్ల అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం పదేపదే దేశీయ మద్యం రేట్లను పెంచుతోంది. బీర్లను తాగడానికి ఇదో కారణమని అబ్కారీ అధికారులు తెలిపారు. ఐటీ బీటీ ఉద్యోగులు, యువత ఎక్కువగా కొంటూ ఉంటారు. బీర్‌లో తక్కువ మొత్తంలో ఆల్కహాల్‌ ఉంటుంది.

మద్యం తక్కువే

నగర మార్కెట్లలో బీర్లతో పోలిస్తే మద్యం విక్రయాలు తక్కువే. బ్రాందీ, విస్కీ, రమ్‌, జిన్‌, వోడ్కా తదితరాల డిమాండ్‌ తగ్గింది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు చివరి వరకు 77 లక్షల పెట్టెలు అంటే.. 667 లక్షల లీటర్ల మద్యం విక్రయమైంది. ఈ ఏడాది ఇదే అవధిలో సుమారు 666 లక్ష లీటర్లు (77.27 లక్షపెట్టెలు) ఐఎంఎల్‌ విక్రయమైంది.

బీర్‌ గ్లాసులు గలగల

బెంగళూరులో ఏడాదిలో 10 కోట్ల లీటర్ల వినియోగం

ఏటేటా పెరుగుదల సర్కారుకు దండిగా రాబడి

ధర పెరిగినా తగ్గని ఖరీదు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడు సార్లు బీర్ల ధరను పెంచింది. 20 శాతం అదనంగా సుంకం విధించింది. దీనివల్ల కంపెనీలు భారాన్ని తగ్గించుకోవడానికి బాటిల్‌ పై రూ.10 వరకూ ధర పెంచాయి. ప్రభుత్వం పన్ను పేరిట రూ.8 నుంచి గరిష్టం రూ.15 వరకు పెంచింది. ఇలా బాటిల్‌ ధర రూ.40 వరకు పెరిగినా మందుబాబులు వెనుకాడడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
గిరాకీ జోరు 1
1/1

గిరాకీ జోరు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement