భార్య స్కూటర్‌ను భైక్‌తో ఢీకొట్టి...
మైసూరు: ద్విచక్రవాహనంలో వెళుతున్న భార్యను మరొక బైక్‌తో భర్తే ఢీకొట్టి హత్యాయత్నం చేసిన ఘటన నగరంలో జరిగింది. ఘటనలో మమత అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమె భర్త మహదేవప్ప అలియాస్ ప్రసాద్ పురోహిత్ నిందితుడు. 23 ఏళ్ల క్రితం మమత, మహదేవప్పలకు వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. మహదేవప్ప నడతపై అనుమానంతో మమత ప్రశ్నించింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భార్యకు విడాకులు ఇచ్చేందుకు మహదేవప్ప న్యాయవాది ద్వారా నోటీసు పంపించారు. మళ్లీ సతాయించను అని ప్రాధేయపడి భార్యతో కలిసి జీవిస్తున్నాడు. కానీ మనసులో కక్ష అలాగే ఉంది. వారం రోజుల తర్వాత భార్యను మహదేశ్వర బెట్టకు వెళ్లమని చెప్పి పంపించాడు. భార్య వెనుదిరిగి వచ్చేలోగా ఇంటిలోని బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. దీంతో మమత గొడవకు దిగింది. కువెంపునగరలో మమత స్కూటర్‌లో వెళ్తుండగా ఎదురుగా మరొక బైక్‌లో దూసుకొచ్చి మహదేవప్ప ఢీకొట్టాడు. కిందపడిన మమతకు చాలా గాయాలయ్యాయి. తనను హత్య చేయాలనే ఢీకొట్టాడని భర్తపై కువెంపునగర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
హత్యకు భర్త కుట్ర
భార్యకు తీవ్రగాయాలు
Comments
Please login to add a commentAdd a comment