రైతు భూమి వక్ఫ్ బోర్డు ఖాతాలోకి
కోలారు: వక్ఫ్‌బోర్డు ఆస్తి వ్యవహారం కోలారులోను కొనసాగుతోంది. తాలూకాలోని దొడ్డహసాళ గ్రామంలో ముస్లిం సముదాయానికి చెందిన వ్యక్తి ఆస్తినే ఎలాంటి సమాచారం అందించకుండానే వక్ఫ్ బోర్డు ఖాతా చేసుకుంది. గ్రామానికి చెందిన సాదిక్ బాషాకు ఆరు ఎకరాల 15 గుంట్ల భూమి ఉంది. మూడు సర్వే నెంబర్‌లలో ఈ ఆస్తిని సాదిక్ పేరుతో ఉంది. సర్వే నెంబర్ 57లో ఐదు ఎకరాల 34 గుంట్ల భూమి, సర్వే నెంబర్ 86లో 5 గుంట్ల భూమి, సర్వే నెంబర్ 100లో 17 గంట్ల భూమిని కలిగి ఉన్నాడు. ఈమధ్య ఆర్‌టిసి తీసి చూసిన సమయంలో తన ఆస్తి హక్కులు వక్ఫ్ బోర్డు కలిగి ఉన్నట్లు తెలిసి సాదిక్ షాక్‌కు గురయ్యాడు. తన ముత్తాత హుస్మాన్ సాబ్ పేరుమీద ఉన్న ఆస్తిని తల్లి పేరుకు ఖాతా చేసే సమయంలో విషయం బయటకు తెలిసింది. 2020–21లోనే వక్ఫ్‌బోర్డు ఖాతా మార్పు జరిగింది. ఇది మాకు హక్కు కలిగిన ఆస్తి.. కావాలంటే హైకోర్టులో దీనిని ప్రశ్నించవచ్చని వక్ఫ్‌బోర్డు అంటోంది. తాము ఎవరికీ దాన పత్రం రాసివ్వలేదని వక్ఫ్‌బోర్డు పేరుకు ఎలా ఖాతా అయ్యిందో తెలియదని రైతు సాదిక్ లబోదిబోమన్నాడు. తమకు హైకోర్టుకు వెళ్లే ఆర్థిక స్థోమత లేదని తమకు న్యాయం చేయాలని రైతు సాదిక్ కోరుతున్నాడు.
కోలారు తాలూకాలో మైనారిటీ రైతుకు షాక్
న్యాయం కోసం మొర
Comments
Please login to add a commentAdd a comment