సీఎం సిద్దుకు లోకాయుక్త పిలుపు
మైసూరు: ముడా ఇళ్ల స్థలాల కేసులో జిల్లా లోకాయుక్త పోలీసులు ఎట్టకేలకు ఏ1 నిందితునిగా ఉన్న సీఎం సిద్దరామయ్యకు నోటీసులు పంపారు. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు మైసూరు లోకాయుక్త కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో తెలిపారు. ఏ2, సీఎం భార్య పార్వతి, ఏ3, బావమరిది మల్లికార్జున, ఏ4, భూ యజమాని దేవరాజు తదితరులను లోకాయుక్త అధికారులు విచారించింది. ఇక సిద్దరామయ్య విచారణ మాత్రమే మిగిలి ఉంది. లోకాయుక్త ఎస్పీ ఉదేష్ తాజాగా నోటీసులు జారీ చేశారు.
హాజరుపై ఉత్కంఠ
40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒకసారి కూడా లోకాయుక్త విచారణను సీఎం ఎదుర్కోలేదు. ఈ నేపథ్యంలో విచారణకు సీఎం సిద్దరామయ్య హాజరవుతారా? అనే ఉత్కంఠ నెలకొంది. మరో వైపు ఈడీ అధికారులు కూడా ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ముడా అధికారుల ఇళ్లు, సీఎం ఆప్తుడు పాపణ్ణ ఇంటిపైనా దాడి చేసి అనేక దాఖలాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి సీఎం సిద్దరామయ్య, మంత్రి బైరతి సురేష్‌లపై ఈడీ గురిపెట్టినట్లు సమాచారం.
6న మైసూరులో విచారణ
Comments
Please login to add a commentAdd a comment