బెంగళూరులో చోరీలు.. కేరళలో విక్రయాలు
బనశంకరి: బెంగళూరు నగరంలో మొబైళ్ల చోరీలు చేసి కేరళలో విక్రయించే ముఠాను శుక్రవారం చంద్రాలేఔట్ పోలీసులు అరెస్ట్ చే శారు. వీరి వద్ద నుంచి రూ.10.50 లక్షల విలువ చేసే 52 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు నగర సీపీ దయానంద్ తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైళ్లను ఆయన పరిశీలించి వివరాలు వెల్లడించారు.
గుట్టు ఇలా రట్టు..:
చంద్రాలేఔట్ గుడ్‌విల్ అపార్టుమెంట్ నివాసి, డీటీడీసీ కొరియర్ మేనేజర్ కొన్ని రోజులుగా కేరళకు పార్సిల్ చేసిన బాక్స్ తీసుకోకపోవడంపై దాన్ని తెరిచి చూడగా అందులో 12 మొబైళ్లు ఫోన్లు బయటపడ్డాయి. వెంటనే ఆయన చంద్రాలేఔట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలుకోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు భద్రావతి బసవేశ్వర సర్కిల్ వద్ద ఒకరిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా మొబైల్ ఫోన్లు డీటీడీసీ కొరియర్ ద్వారా కేరళ రాష్ట్రానికి పార్శిల్ చేసినట్లు నోరువిప్పాడు. ఇతడిని తీవ్రంగా చేపట్టగా నలుగురు వ్యక్తులు సభలు, సమావేశాలు, జాతర సమయాల్లో మొబైళ్ల చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. చోరీ మొబైళ్లను బయట రాష్ట్రాలకు విక్రయించడం కోసం కొరియర్ ద్వారా పార్శిల్ చేస్తున్నట్లు తెలిపి అక్కడ విక్రయించే వ్యక్తి గురించి సమాచారం అందించగా బోవి కాలనీ నివాసి ఇంటి నుంచి 10 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. కేరళ కొండుపరంబిల్‌లో మొబైల్ ఫోన్లు స్వీకరిస్తున్న మరో వ్యక్తిని అతడి మొబైల్ దుకాణంలో అరెస్ట్‌చేసి 30 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని కమిషనర్ తెలిపారు. పశ్చిమ విభాగ డీసీపీ గిరీశ్, ఏసీపీ భరత్‌రెడ్డి నేతృత్వంలో చంద్రాలేఔట్ సీఐ భరత్ పోలీస్ సిబ్బంది మొబైళ్ల చోరీ ముఠాను ఛేదించారు.
ముఠా అరెస్ట్
52 మొబైళ్లు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment