మల్లేశ్వరంలో శనక్కాయల పరుష | - | Sakshi
Sakshi News home page

మల్లేశ్వరంలో శనక్కాయల పరుష

Published Sat, Nov 16 2024 9:00 AM | Last Updated on Sat, Nov 16 2024 9:00 AM

మల్లే

మల్లేశ్వరంలో శనక్కాయల పరుష

బనశంకరి: కార్తీకమాసం సందర్భంగా మల్లేశ్వరంలో శుక్రవారం కాడుమల్లేశ్వర స్నేహితుల సంఘం ఆధ్వర్యంలో శనక్కాయల పరుష అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాడుమల్లేశ్వరుడి ఆలయంలో మల్లేశ్వరుడి మూలవిరాట్‌, నందీశ్వరుడికి శనక్కాయలతో అలంకరణ చేపట్టి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం సంఘం అధ్యక్షుడు బీకే.శివరాం శనక్కాయల పరుషను ప్రారంభించారు. నాలుగురోజుల పాటు నిర్వహించే శనక్కాయల పరుషకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ నుంచి రైతులు వచ్చి శనక్కాయలు విక్రయిస్తారు. రోజూ వివిధ సాంస్కృతిక సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు. బెంగళూరు నగరవాసులు తరలివచ్చి కాడుమల్లేశ్వరుడిని దర్శించుకుని శనక్కాయలను కొనుగోలు చేశారు. పదాధికారులు చంద్రశేఖర్‌, శ్రీ వల్లభ, చంద్రమౌళి, ఎల్‌ఎన్‌.ప్రభు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మల్లేశ్వరంలో శనక్కాయల పరుష1
1/1

మల్లేశ్వరంలో శనక్కాయల పరుష

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement