పిల్లల్లో పోటీతత్వం పెంపొందించాలి
హొసపేటె: విజయనగరం జిల్లాలో పిల్లలు చదువులో వెనుకబడుతున్నారని, పిల్లల్లో పోటీతత్వం పెంపొందిస్తేనే అభ్యసనలో పురోగతి సాధించవచ్చని పాఠశాల విద్యాశాఖ ఉప సంచాలకులు ఓఆర్ ప్రకాష్ అభిప్రాయపడ్డారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, పాఠశాల విద్యాశాఖ, అక్షర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గణిత సదస్సులో ఆయన మాట్లాడారు. పిల్లల సమగ్ర విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలి. మ్యాథమ్యాటిక్స్ లెర్నింగ్ మావ్‌మెంట్ నివేదిక ప్రకారం, జిల్లాలోని అన్ని తాలూకాలతో పోలిస్తే, హరపనహళ్లి తాలూకా అభివృద్ధి చెందుతోంది. హోస్పేట్ తాలూకా వెనుకబడి ఉంది. ఈ నివేదికను పరిశీలించిన ఉపాధ్యాయులు.. పిల్లలు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో ఆయా సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ పిల్లలను చదువుపై మరింత ఆసక్తి పెంచాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖ, గ్రామ పంచాయతీలు, ప్రజాసంఘాల సహకారంతో నిర్వహించిన గణిత అభ్యసన ఉద్యమం విజయవంతంగా ముగిసిందని అక్షర ఫౌండేషన్ కార్యక్రమ నిర్వాహకులు హెచ్‌బీ పిల్లల నాణ్యమైన విద్య కోసం అక్షర ఫౌండేషన్ పాఠశాల విద్యాశాఖ భాగస్వామ్యంతో పని చేస్తుంది. ఈ ఉద్యమ నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఫలితం ఎక్కువగా కనిపిస్తుంది. జిల్లాలో 756 పాఠశాల నుంచి 23,385 మంది చిన్నారులు పాల్గొనగా, ఈ ఉద్యమానికి గ్రామ పంచాయతీలు, పాఠశాల ఉపాధ్యాయుల కృషి అభినందనీయమన్నారు. జీకే 2.7 కోర్సును అక్షర ఫౌండేషన్ ప్రవేశ పెట్టింది. ఉపాధ్యాయులందరూ దీనికి సద్వినియోగం చేసుకొని పిల్లలుకు గణితం ఆసక్తిగా అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా తాలూకా విద్యాశాఖ అధికారులు, ముఖ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
డీడీపీఐ ఓఆర్ ప్రకాష్
Comments
Please login to add a commentAdd a comment