ఎంత పని చేశావమ్మా!
● ఇద్దరు పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్య
● పేదరికం, కుటుంబ కలహాలకు బలి
కేజీఎఫ్/ కోలారు: ఒకవైపు పేదరికం, మరోవైపు కుటుంబాన్ని పట్టించుకోకుండా తాగుడుకు బానిసైన భర్త.. ఈ పరిస్థితుల్లో ఓ తల్లి దారుణ నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కేజీఎఫ్ తాలూకాలోని కమ్మసంద్ర గ్రామంలో చోటు చేసుకుంది. తిప్పమ్మ (30), పిల్లలు మౌనీశ (7), నితిన్ (4) మృతులు. తిప్పమ్మ, భర్త మణి కూలీ పనులు చేసేవాడు. కూలీ డబ్బుంతా తాగుడుకు ఖర్చు చేసేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ కలహాలు జరుగుతుండేవి. కొత్త ఏడాదికి కొత్త బట్టలు, కేక్ కావాలని పిల్లలు కోరారు. ఆర్థిక సమస్యలతో పిల్లల కోరికను తీర్చలేనని అనుకుంది. ఈ ఆవేదనతో బుధవారం ఉదయమే ఇద్దరినీ గొంతు పిసికి చంపిన తిప్పమ్మ... తరువాత ఉరి వేసుకుని తనువు చాలించింది. కామసముద్రం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టు మార్టం కోసం కేజీఎఫ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్త మణిని అదుపులోకి తీసుకు ని విచారణ చేస్తున్నారు.
సహజీవనంలో దురాగతం
● ఇద్దరు అరెస్టు
బనశంకరి: ప్రైవేటు ఫోటోలు, వీడియోలు తీసి స్నేహితురాలినే బ్లాక్ మెయిల్ చేస్తున్న హేమంత్, హరీశ్ అనే ఇద్దరిని నగర సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఎలక్ట్రానిక్‌సిటీ నివాసి హేమంత్, భద్రావతి వాసి హరీశ్ నిందితులు, వారి నుంచి 7 మొబైల్స్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. హేమంత్ 2017 నుంచి ఎలక్ట్రానిక్ సిటీలో ఎలక్ట్రానిక్స్ పరికరాల షాపు నడుపుతున్నాడు. కస్టమర్‌గా వచ్చిన యువతి పరిచయమైంది. ఇద్దరి మధ్య స్నేహం పెరిగి 4 ఏళ్లు ఒకే ఇంట్లో సహజీవనం సాగిస్తున్నారు. హేమంత్ అత్తిబెలెలో బార్ అండ్ రెస్టారెంట్ తెరిచి దానికి హరీశ్‌ను మేనేజర్‌గా నియమించాడు. 2021లో కపుల్స్ పార్టీకి వెళ్లి మద్యం తాగారు, అనైతిక సంబంధానికి ఆమెను ఒత్తిడి చేయగా నిరాకరించింది. దీంతో హేమంత్, హరీశ్ ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డారు. ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment