దేశ సేవలో అమరులు
యశవంతపుర: జమ్ముకశ్మీర్‌లో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఐదు మంది సైనికులు అమరులు కాగా, వారిలో ముగ్గురు కన్నడిగులు ఉన్నారు. మంగళవారం సాయంత్రం పూంచ్ జిల్లాలో సైనికుల ట్రక్ లోయలోకి బోల్తా పడింది. బాగలకోట జిల్లా రబకవి బనహట్టి తాలూకావాసి మహేశ్ మారిగోండ (25), బెళగావి తాలూకావాసి దయానంద తిరకణ్ణవర (44), కుందాపుర బీజాడికీ చెందిన అనూప్ మరణించారు. అక్కడి నుంచి వారి కుటుంబాలకు, జిల్లా కలెక్టర్లకు సమాచారం వచ్చింది. అనూప్ 13 ఏళ్లు నుంచి ఆర్మీలో పని చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడాది చిన్నారి ఉంది. దయానంద మరో రెండేళ్లలో రిటైరు కావాల్సి ఉంది. మహేశ్ మూడునాలుగేళ్ల కిందటే ఉద్యోగంలో చేరాడు. వారి మృతదేహాలను విమానంలో బెళగావికి తరలించి సొంతర్లకు తీసుకొస్తారు. వారి మృతి పట్ల సీఎం సిద్దరామయ్య సంతాపం తెలిపారు.
మణిపూర్‌లో మరొకరు...
మరోవైపు, మణిపూర్‌లోని ఇంఫాల్ జిల్లాలో లోయలో ఆర్మీ వాహనం పడిపోయి చిక్కోడి తాలూకావాసి ధర్మరాజ ఖోత (43) అనే ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. రెండు నెలల్లో రిటైరై ఊరికి వస్తానని కుటుంబానికి, స్నేహితులకు చెప్పేవాడు. అంతలోనే ఘోరం జరిగింది. మృతదేహాన్ని విమానంలో గోవాకు తరలించి అక్కడి నుంచి చిక్కోడికి తెచ్చారు. గురువారం స్వగ్రామం కుప్పానవాడిలో అంత్యక్రియలు జరుగుతాయి.
జమ్ము కశ్మీర్‌లో ట్రక్కు బోల్తా
ముగ్గురు కన్నడ జవాన్లు మృతి
Comments
Please login to add a commentAdd a comment