క్షతగాత్రునికి ఖాకీల మేలు
శివమొగ్గ: అడవి రోడ్డులో గాయపడిన బైకిస్టుకు గస్తీ పోలీసులు గమనించి ఆస్పత్రికి తరలించి ఆదుకున్న ఘటన జిల్లాలోని హొసనగర తాలూకా రిప్పన్‌పేటె పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. వివరాలు.. హొసనగర పోలీసు స్టేషన్ ఏఎస్‌ఐ గణపతిరావు, శివమొగ్గ రిజర్వు కానిస్టేబుల్ గిరీష్ అనే ఇద్దరు గవటూరు అడవిలో రాష్ట్ర రహదారిపై గస్తీ కాస్తుండగా ద్విచక్ర వాహనదారు ఒకరు రోడ్డు పక్కన పడిపోయి ఉండటాన్ని గమనించారు. బైకిస్టు తీవ్ర రక్తస్రావానికి గురై స్పృహ కోల్పోయి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసు వాహనంలో ఉన్న సామగ్రితో ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత రిప్పన్‌పేటె ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, ఆపై శివమొగ్గలోని మెగ్గాన్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బైక్‌చోదకుడు ప్రాణాపాయం నుంచి బయట పడినట్లు వైద్యులు తెలిపారు. రిప్పన్‌పేటె సమీపంలోని చిక్కజేని గ్రామ నివాసి భాస్కరాచార్ (30)గా గుర్తించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా ఏఎస్‌ఐ, పోలీసును ఎస్పీ జీకే మిథున్‌కుమార్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment