హుబ్లీ: బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి అరెస్ట్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని బెళగావిలోని ఖానపుర పోలీస్ స్టేషన్ సీఐ మంజునాథ్ నాయక్‌ను సస్పెండ్ చేసినట్లు ఐజీపీ వికాస్‌కుమార్ తెలిపారు. ఈ నెల 19న సీటీ రవిని హిరేబగవాడి స్టేషన్ నుంచి ఖానపుర పోలీస్ స్టేషన్‌కు తరలించే సమయంలో కొందరు బీజేపీ నాయకులు ఆ సీఐ ఆఫీసులోకి వెళ్లి చర్చించారు. అలాగే కొందరు నాయకులు లోపలికి దూసుకు రావడంతో గందరగోళం నెలకొంది. ఇది సీఐ బాధ్యత రాహిత్యమేనని నిర్ధారించి వేటు వేశారు. మరోవైపు సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ బీజేపీ, అనుబంధ సంఘాలు శనివారం ఖానపూర్ బంద్‌కు పిలుపునిచ్చాయి. కాగా, మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ను రవి దూషించారనే కేసును సీఐడీకి అప్పగింతపై స్పందించబోనని విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ్ హొరట్టి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment