నేడు బళ్లారి బంద్ విజయవంతానికి పిలుపు
సాక్షి,బళ్లారి: నేడు దేశభక్త నాగరిక వేదిక ఆధ్వర్యంలో జరపతలపెట్టిన బళ్లారి బంద్‌ను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం తన నివాస గృహంలో మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, హింసాకాండను ఖండిస్తూ బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్, విశ్వ హిందూ పరిషత్, భజరంగ్‌దళ, హిందూ జాగరణ వేదిక, బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో బంద్ చేస్తున్నారని, స్వచ్చందంగా బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. బళ్లారి నగరంలోని ప్రతి వ్యాపారస్తుడు, అంగళ్లు, హోటళ్లు, సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా బంద్ చేసి హిందువులకు మద్దతుగా నిలవాలన్నారు. బంద్ సందర్భంగా వ్యాపారస్తులు తమ దుకాణాలను మూసివేయడంతో పాటు వారు కూడా పాల్గొని తమ శక్తిని ప్రదర్శించాలన్నారు. హిందువుల ఐక్యతను చాటేందుకు ప్రతి ఒక్క హిందువు చేయి చేయి కలపాలన్నారు. హిందువులు ఐక్యతతో ఉంటే దాడులు చేసేవారికి భయం పుడుతుందని సూచించారు.
స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనండి
మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment