బెట్టింగ్ యాప్‌లలో రూ.3 కోట్లు బూడిద
దొడ్డబళ్లాపురం: ఆన్‌లైన్ గేమింగ్– బెట్టింగ్ యాప్‌ల మాయలో పడి లక్షల రూపాయలు పోగొట్టుకునే అభాగ్యులు ఏదో ఒక చోట బయటపడుతున్నారు. ఓ ఉద్యోగి లక్షలు కాదు ఏకంగా రూ.3 కోట్లు నష్టపోయిన సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ప్రైవేటు కంపెనీలో పని చేసే నిశాంత్ శ్రీవత్స బాధితుడు.
తక్కువ మొత్తంలోనే గెలుపు
శ్రీవత్సకు మొబైల్‌ఫోన్‌లో గేమ్‌లు, బెట్టింగ్ ఆడడం మక్కువ. నిరంతరం వాటిలోనే మునిగిపోయేవాడు. మొదట్లో సరదాగా వాటిని ఆడుతూ తరువాత బానిసగా మారిపోయాడు. గేమ్‌లు ఆడిన ప్రారంభకాలంలో బాగానే డబ్బులు వచ్చాయి. దీంతో ఆశకు పోయి పెద్ద పెద్ద మొత్తాల్లో ఆడడం ప్రారంభించారు. రోజుకు రూ. 4, 5 లక్షలు పెట్టి నష్టపోయినా తరువాత గెలుచుకోవచ్చనే ధీమాతో అలాగే జూదమాడేవాడు. కానీ రోజురోజుకు డబ్బులు పోవడమే తప్ప రావడం కలలో మాటైంది. చివరకు సొంత డబ్బులు, అప్పులు చేసి ఆడినా పైసా కూడా దక్కలేదు. సదరు యాప్‌లలో చిన్న మొత్తం బెట్టింగ్ కట్టినప్పుడు గెలుస్తామని, పెద్ద మొత్తంలో బెట్టింగ్ కట్టినప్పుడు ఓడిపోవడం జరుగుతుందని అతడు కనుగొన్నాడు. ఆట ఆడిన టేబుల్ సమాచారాన్ని కూడా యాప్‌లో చూపరని ఫిర్యాదులో పేర్కొన్నాడు. చివరకు రూ. 3 కోట్ల వరకూ నష్టపోయినట్లు నగర సెంట్రల్ సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు 52 యాప్‌లపై కేసు నమోదు చేశారు.
ప్రైవేటు ఉద్యోగి లబోదిబో
Comments
Please login to add a commentAdd a comment