అసెంబ్లీకి ఆహ్వానం
బనశంకరి: ఈసారి బెళగావి శీతాకాల సమావేశాలకు రూ.25 కోట్లు ఖర్చు కానుందని, ఇందులో సమగ్ర కర్ణాటక అభివృద్ధి గురించి చర్చిస్తామని, అందులోనూ ఉత్తర కర్ణాటకకు ప్రాధాన్యత ఇస్తామని విధానసభ స్పీకర్ యుటీ ఖాదర్ తెలిపారు. సోమవారం నుంచి బెళగావి శివార్లలోని రెండవ అసెంబ్లీ భవనం సువర్ణసౌధలో 10 రోజుల పాటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన సువర్ణ సౌధలో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు.
సభాపతి పీఠానికి రూ. 45 లక్షల ఖర్చు
సమావేశాల ఆరంభంలోనే ఉత్తర కర్ణాటక సమస్యలపై చర్చించాలనే డిమాండ్ ఉందని,
అన్ని పక్షాల సమావేశంలో సమగ్రంగా చర్చించి తీర్మానిస్తామన్నారు. ఈసారి ఐదు బిల్లులపై సుదీర్ఘంగా చర్చిస్తామన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. బెంగళూరు అసెంబ్లీలో ఉన్నట్లుగానే సువర్ణసౌధలోను సభాపతి పీఠాన్ని తీర్చిదిద్దారని, ఇందుకు అటవీశాఖ అభివృద్ధి మండలి రూ.45 లక్షలు ఖర్చు చేసిందని సభాపతి తెలిపారు. సమావేశాలకు గైర్హాజరయ్యే సభ్యులకు జరిమానా విధాస్తారా అనే ప్రశ్నకు, దీనిపై ఆలోచించలేదని, చూద్దామని అన్నారు.
అనుభవ మంటపం చిత్రం
సువర్ణసౌధలో బసవేశ్వరుని అనుభవ మంటపం బృహత్ చిత్రాన్ని ఆవిష్కరిస్తారు. ఆ పెయింటింగ్‌ను ఆయన వీక్షించారు. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంబిస్తామని, అంతకు ముందు బసవణ్ణ అనుభవ మంటపం తైలవర్ణ చిత్రాన్ని సీఎం సిద్దరామయ్య ప్రారంభిస్తారని తెలిపారు. పలు సంఘాలు ముట్టడిస్తామని హెచ్చరించడంతో అసెంబ్లీ పరిసరాల్లో 8,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటైంది. వివిధ కమిటీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలకు వసతి, భోజనం, రవాణా వ్యవస్థను కల్పిస్తాయని తెలిపారు. అసెంబ్లీని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. మరోవైపు సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాలు బీజేపీ, జేడీఎస్ మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగే అవకాశముంది.
నేటి నుంచే బెళగావిలో
శీతాకాల సమావేశాలు
రూ. 25 కోట్ల వ్యయం: స్పీకర్ ఖాదర్
సువర్ణసౌధ ముస్తాబు
Comments
Please login to add a commentAdd a comment