అల్పపీడనం.. నేడు వర్ష ఆగమనం!
శివాజీనగర: బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఉద్భవించగా రాష్ట్రంలో గురువారం వర్షం కురిసే అవకాశముంది. దక్షిణ ఒళనాడులోని 10 జిల్లాలైన బెంగళూరు నగర– రూరల్, చామరాజనగర, చిత్రదుర్గ, కొడగు, కోలారు, మండ్య, మైసూరు, రామనగర, తుమకూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీచేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. బెంగళూరు నగరం, చుట్టుపక్కల 48 గంటలపాటు మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్లలో ఉరుములతో కూడిన వర్షానికి ఆస్కారముంది. బెంగళూరు వాతావరణ కేంద్రం ప్రాంతీయ డైరెక్టర్ సీ.ఎస్.పాటిల్ మాట్లాడుతూ నైరుతీ బంగాళాఖాతంలో అల్పపీడనం నెలకొంది. తమిళనాడు, శ్రీలంక వైపు సాగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గురువారం రాష్ట్రంలో వర్షం కురవవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment