అంగన్‌వాడీలను పర్మినెంట్ చేయాలి
తుమకూరు: గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకురాళ్లను కేటగిరి–3, 4 ఉద్యోగులుగా పరిగణించి, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర అంగన్‌వాడీ ఉద్యోగుల సంఘం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.వరలక్ష్మి డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని వీరసౌధలో అంగన్‌వాడీల జిల్లా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వారి హక్కుల గురించి పుస్తకాన్ని ఆవిష్కరించారు. రిటైర్మెంటు లబ్ధి, గ్రాట్యుటీ తదితరాలను అమలు చేయాలని కోరారు. పెద్దసంఖ్యలో సిబ్బంది, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment