రాయచూరు.. కుక్కల హోరు
రాయచూరు రూరల్: జిల్లా కేంద్రమైన రాయచూరులో కుక్కల బెడద తప్పేనా అని ప్రజలు తలపట్టుకుంటున్నారు. ఏ వీధిలో చూసినా ఏమున్నది గర్వకారణం.. కుక్కల గందరగోళం తప్ప అని చింతించాల్సి వస్తోంది. వీధి శునకాలు స్వైర విహారం చేస్తూ పిల్లలను కరుస్తున్నాయి. దీంతో రేబీస్ ముప్పు పొంచి ఉంది. రాత్రి సమయాలలో ప్రజలు బయటకు వస్తే దాడికి దిగుతున్నాయి. తప్పించుకోవడానికి పరిగెత్తి కిందపడి గాయాలైన ఉదంతాలున్నాయి. మరోవైపు పెంపుడు శునకాల గోల సైతం అదే మాదిరి ఉంటోంది. యజమానులు తమకేమీ పట్టనట్లు ఉండడంపై ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో దాదాపు 900కు పైబడి వీధి కుక్కలున్నట్లు అంచనా. పగలూ రాత్రి రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వారం రోజుల్లో 100 మందికి కుక్కలు కరవడంతో ఆస్పత్రికి పరుగులు తీశారు. సకాలంలో టీకాలు వేసుకోకుంటే ప్రాణాలే పోయే ప్రమాదముంది. రేబీస్‌కు గురై పెద్దాస్పత్రిలో చికిత్స పొందుతున్న మద్దిపేట యువతి కోమాలోకి జారుకుంది. ఆమె బుధవారం మరణించడంతో కుటుంబం తల్లడిల్లింది.
రేబీస్‌తో యువతి మృతి
Comments
Please login to add a commentAdd a comment